Friday, November 11, 2011


వాడి తలపు వేడిలో సుడిగాలిలో
తూలిపోయి సోలిపోయి
రెపరెప లాడుతు తపనపడే
నీ కోసం ఏం చెయ్యను ఏ మివ్వను?

ఎర్రబారి మంకెనలవు
నీ కనుదోయి రెప్పమూసి
చలచల్లని పెదవులాన్చి
సేద దీర్చనా............

కందిపోయి మందారమైన చెక్కిలిపై
హిమ సుమాల కన్నీళ్ళు రాల్చి
సుమగంధపు లేపనమని
అనునయించనా.............
ఈ వంకా ఆ వంకా మధ్యన
సముద్రాల దూరమైనా
రేయంతా ఇరువురిదీ కలవరింత
’ఒకరిదేమొ ఏకాంతపు తపన
వేరొకరిది మమకారపు సహ వేదన...

No comments: