నిమిషాలకూ ఘడియలకూ కాళ్ళు తిమ్మిరెక్కి కదలని వేళ
సమయం జారుడు బండ నడి మధ్యన స్థంభించి
సుషుప్తిలోకి జారిపోయిన వేళ
నీ చిరునవ్వు హేల మాటల లాలి
చూపుల్లో మెత్తని అనునయం
వీటన్నింటా శిలాసదృశ్యమైన మనస్సు ద్రవించి ద్రవించి ప్రవాహమై
నేనో పరీవాహక ప్రాంతంగా
మానవతనూ ప్రేమామృతాలనూ పండిస్తూ ...............
ఓ కప్పు చీకటిని సేవించి
గుప్పిళ్ల కొద్ది ఆకాశం నడి నెత్తిన విసిరి
విశ్రమించిన జాబిలికేం తెలుసు
ఇక్కడ ఈ చీకటి ప్రపంచం
ప్రతి హృదయం ఓ దివ్వెగా మారి
ప్రేమ వెలుగులను రగిలిస్తుందని
చీకటిని చివరంట రగిలించి దీపావళి జరుపుకుంటుందని.