కళ్ళు మొహంలోంచి మొలిచి
ముందుకే చూస్తుంటాయి
శూన్యావరణాల కొలతల్లో
చిక్కులుపడిన చూపు
వెర్రి నవ్వొకటి అలవోకగా విసిరేస్తుంది
అయినా
నా వెనకాల వెకిలి వేషాల అలికిడి
సవర్ణ దౄశ్య మాలికగా
మనో వీధిలో బీటు కోడుతూనేవుంటుంది
గుండెకు విసిరికొట్టిన మాటలు
రెక్కలు విరిగిన పసిపాప పక్షులై
ఠపఠపా నేలకు రాలుతూనేవుంటాయి
కాళ్ళకిందా నడినెత్తినా
వేడి కుంపట్ల అడకత్తెరలో
ముక్కలు ముక్కలై వికీర్ణమైన
పాలిపోయిన రక్తపు చుక్కలు
సంకీర్ణమౌతూ సమైక్యిస్తూ
ద్రవీకరించి ప్రవహిస్తూ
మాటల మూలాల్లోకి మౌనంగా జారిపోతాయి
నాముందూ వెనకా
నలుదిక్కులా
నడిచే ప్రతి వెలుగుముక్కా
చీకటిచుక్కా
అన్నీ నా కలం నింపే అక్షర సముద్రాలే
స్వాతీ శ్రీపాద
Saturday, June 20, 2009
నిశ్శబ్దం
నడుస్తూ నడుస్తూన్న
అరిపాదం సౌకుమర్యం లోకి
కసుక్కున ఇనపమేకు గుచ్చుకున్నట్టు
ఉలితాకిడికి గారాలు పోతూ విలపించే
రాతిగుండె బీటవారిన వంపులో మొన లా
తడుముకుంటూచిరిగిన జీవితాల్ని అతుకులేసుకుంటున్న
పాతతరం వేల్లో దిగిపోయిన సూది మొనలా
నిశ్శబ్దం ఇలా చురుక్కుమంటూ మెత్తని కత్తిలా
ఉనికిని గాయ పరుస్తున్నవేళ
కళ్ళ ముళ్ళకంచెలు
రహస్యంగా ఎన్ని కాపలాలు కాస్తున్నా
రాత్రి మాధుర్యాలు తాగితాగి
తూలిపోతున్న ఊహలు
నింగీ నేలా పరుచుకున్న పరీమళాలై
అలరింపు గానలై
పరిసరాల్ను పరవశం ముగ్గులోకి లాగుతూ
చిక్కులు పడ్డ రహదార్ల ముళ్ళు విడదీస్తూ
ప్రతిక్షణం అల్లుకు పోతున్న పద్మవ్యూహాల్ను
చూపుల ఆయుధాల్తో సవరించుకుంటూ
అవిశ్రాంతంగా అలుగులెత్తీ పొరలే
జీవనదులు
ఒక్కసారి అదౄశ్య శక్తులు
మంత్రించినట్టునిశ్శబ్దం
ఏముందిక ఎదురులేని నిశ్శబ్దం తప్ప.

చూపు
ఉలిక్కి పడి నిద్రలేచింది అల.
పెళ్ళి మాట ఎత్తినప్పటినుండీ ఇదే వరస.
పీడకలలా గతం ప్రతిరాత్రీ పీడించడమే !
ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఘాతకం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ...
ఎలా? ఎలా మర్చిపోవాలి !
*************
బెరుకు బెరుగ్గా చీకటి మసకలో ఆకారాలను ఊహించుకోవడం ఆరంభించింది.
ఆ పక్కన చిన్నత్త, ఈ పక్కన చిన్న చెల్లెలు అందరి మధ్యలో ఉన్నా .......
ఎందరిలో ఉన్నా చీకటి భూతం వుందిగా , క్రౌర్యంగా బరువైన పొగ మేఘంలా ఆక్రమించుకుందుకు...
ఒక బెడ్ రూం , ఒక హాలు ఓ చిన్న వంటగది మరో చిన్న రూం ...ఇవీ ప్రభుత్వం అందించిన వసతి సౌకర్యాలు.
అలకు తన మిత్రురాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఎంతో ఈర్ష్యగా అనిపించేది. పెద్ద పెద్ద ఇళ్ళు , ఇంటిచుట్టూరా తోట , ఒక సర్వెంట్, ఒక వంట మనిషి ఇంకా అనఫీషియల్ గా ఎందరో...
గాజు బొమ్మల్లా అతి నాజూగ్గా తన స్నేహితులు..
అవును ! వాళ్ళు ఆఫీసర్ల పిల్లలు మరి.
తన తండ్రి కేవలం ఎయిర్ మాన్.
తండ్రి మాట మనసుకు చేదుగా తగిలింది.
తండ్రులంటే ఎంత ప్రేమగావుంటారు?
కూతురికి మనసునొచ్చుకున్నా తండ్రి కంట రక్తం చిమ్ముతుంది.
డెలికేట్ డాల్ మాదిరి నడిస్తేనే కూతురెక్కడ కందిపోతుందోనని స్కూల్ కి బండి మీద తెచ్చి వదులుతారు.
తెల్లగా మిల మిల లాడుతూ దంతపు బొమ్మల్లా...
ఒక్కసారి తనవైపు తను చీకట్లోనే చూసుకుంది
చీకటికీ కళ్ళుంటే తనను హేయంగా చూసేదేమో?
నల్లగా అట్టలట్టలుగా ఒళ్ళు..
స్కూల్లో సైన్స్ చదువుకుంటోంది.. అంతో ఇంతో లోకజ్ఞానమూ వుంది.
డ్రై స్కిన్ కావడం వల్ల ఒంట్లో తేమ తగ్గి బీటలు వారినట్టున్న చర్మంలో ఫంగస్ క్రిములు చేరి తెల్లమచ్చలు...
శోభి అనీ షుభకరమనీ అందరూ అనుకోవడం -వారి అవిద్యకు అమాయకత్వానికీ నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు. దానికి తోడు శీతాకాలం చలికి పెంకుగట్టే చర్మం రంగు...
పగిలిన నల్లకుండ ముక్కలు గుర్తొచ్చేవి..
అయినా ఈ చీకటి భూతానికి తనంటేనె ఎందుకంత ప్రేమ.....
చిమ్మ చీకట్లో కన్నుపొడుచుకున్నా ఏమీ కనబాడని అంధకారంలో ...
అబ్బ తలుచుకుంటేనే రక్తం గడ్డకట్టిపోతుంది...
ఇందాకిందాకే జరిగినట్టు అనిపిస్తుంది...
మంచి గాఢ నిద్ర... ఆ నిద్రలోనే ఒళ్ళంతా అదిమి పట్టి ..ఏదో వెదుకులాట... నిద్రలోనూ ఇంకా ఇప్పుడిప్పుడే పొడసూపుతున్న ఎదను ఎవరో అదిమి పట్టిన బాధ.. విదుల్చుకుందామన్నా ఉహు...
మరో పక్క నిద్రలో పైకి పోయిన గౌన్ కింద అండర్ వేర్ కిందకు లాగుతూ ..
అప్రయత్నంగానే వారించబోయినట్టుగుర్తు...
కాని ముందుకోచ్చిన చెయ్యిని అలాగే వెనక్కు విరిచి.. మోచెయ్యి దగ్గర విరిగిపోతున్నంత బాధ ..
అంతలోనే ... చిన్న గీతముందు పెద్ద గీత మొలిచినట్టు .. ఎక్కడఓ చెప్పుకోలేని చోట భగ్గుమన్న కోత...
"అత్తా..."
పిలిచాననుకుంది కాని.. పెదవి కదలకముందే... పళ్ళకు గట్టిగా అదిమి పట్టిన రాక్షస హస్తాలు...
ఇదేనేమో చచ్చి పోవడం.. ఇదేనేమో నరకం అనుకున్నా ఎంత పెనుగు లాడి నా .... ఓడి పోయి నిస్సత్తువగా లొంగిపోయాక ...
ఏజరిగిందో .. ఎప్పటికి స్పౄహ వచ్చిందో తెలీదు...
పీడ కలా... పీడకలేనా ?
అయితే కిందంతా జిగురు జిగురుగా ... లేచి బాత్ రూం కి వెళ్ళలన్నా భయంగా వుంది.
గట్టిగా ఏడవడానికీ ధైర్యం చాలలేదు...
చీకట్లోకి కళ్ళు గుచ్చి గుచ్చి చుస్తూ జీభూతాన్ని వెతకాలని ప్రయత్నించింది.
ఉహు! భూతం కాదు ఇంకా కాళ్ళల్లో ఒణుకు ... ఎక్కడో ఆగని జ్వాలలా మంట తెలుస్తూనే ఉన్నాయి..
బాధ ఓర్చుకోలేక అటూ ఇటు కొట్టు మిట్టాడింది.
అత్త మేలుకునే ఉన్నట్టుంది.
లాలనగా మీద చెయ్యేసి దగ్గరకులాక్కుంది..
"చిన్నత్తా"
గొంతువణికింది..
ఏదో చెప్పబోయింది.
"భూతం వచ్చిందా?"
"అవునత్తా భూతం నన్ను..."
"గట్టిగా మాట్లాడకు... ఆభూతం ఇదివరకే మా అందరినీ ... చిత్రహింసలు పెట్టింది ..ఈరోజు నీ వంతు..."
" అవునా..."
"ఊ"
"ఎక్కడా ఈ విషయం చెప్పకు ...భూతం చంపేస్తుంది.."
"అత్తా నిజంగా భూతమేనా...." ఏదో అనుమానం
"ఉష్! మాట్లాడకు..."
తెల్లారాక కూడా రక్తం చూసుకుని బాధ తలచుకుని దయ్యమనే నమ్మింది.
అది మొదలు అప్పుడో ఇప్పుడో భూతం అలా దాడి చేస్తూనేవుంది.
ఇవ్వాళ స్కూల్లో టీచర్ ఆడపిల్లలతో విపులంగా మాట్లాడే వరకూ అలానే నమ్మింది.
కాని ఇంట్లో వున్న మగ వాడు తండ్రి ఒక్కడే ! అదే నిజమయితే ...
కాపాడవలసిన తండ్రే కాలకింకరుడైతే.........
నిద్ర పట్టడం లేదు ఏం చెయ్యాలి... అమ్మ ఒక చిన్న దీపమయినా వుంచదు...
కటిక చీకటిలో.....
ఏదో అడుగుల శబ్దం
మళ్ళీ భూతం వస్తోదా?
ఇవ్వాళ దీని అంతేమిటో తేల్చి పారెయ్యాలి ఏదైతే అది అవుగాక..
ఎంతో స్థర్యమం కూడా గట్టుకుంది అల.
ఎదుర్కొందుకు సిద్ధ పడింది. కాని ఈరోజు భూతం తనవైపు రావడం లేదు
ఎడం వాఇపు తడిమింది.. అత్త మామూలుగానే నిద్రపోతోంది..
కుడివైపు చెల్లెలు సీమ .. అరె చేతికి తగలట్లేదే .. ఒకసారి దొర్లి చెయ్యి చాపింది
అల ఊహ నిజమే ఉక్కిరి బిక్కిరౌతూ తన్నుకుంటోంది సీమ... దానిపై పెను భూతం
మరింక ఆగదలచుకోలేదు అల.
ఒక్కంగలో దూకి దొరికిన భుజాన్ని కండలూదివచ్చేలా కొరికింది.
"రాక్షసి ముండా..." తండ్రి భీకరమైన అరుపు..
నోటికి ఉప్పగా తగిలిన రక్తం కన్న వెగటుగా తోచింది అతని గొంతు..
" రావే .. రా వచ్చి లైట్ వెయ్యి నీ దరిద్రపు కూతురి నిర్వాకం చూసుకో .. ఎక్కడ చచ్చావు రోగిష్టి మొఖమా?"
బిత్తరపోయిన అల కొయ్య బారిపోయిన సీమ నిర్లిప్తంగా వాళ్ళ చిన్నత్త చూస్తూండగానే లైట్ వెలిగింది...
అతని భుజం మీదినించి ధారలుగా కారుతూ రక్తం
ఎక్కడ తూలిపోతానో అన్నట్టు ద్వారం పట్టుకు నించున్న తల్లి మొహం పాలిపోయింది..
అల వంక ఒకసారి కౄరంగా చూసి లోపలి గదిలోకి వెళ్ళి పోYఅడు భీకరం గా కనిపిస్తున్న అల తండ్రి.
"ఎంత పని చేసావే రాక్షసీ .." ఏడుస్తూ లోపలకు వెళ్ళింది తల్లి.
చిన్నత్త వంక చూసింది అల. అపరాధిలా తలవంచుకుంది ఆమె.
"అత్తా... ఈ భూతం నాన్న అని నీకు తెలుసా? "
"................"
"చెప్పు అత్తా..........."
" నాకే కాదు అలా ... పెద్దత్తకూ.. వైశాలి అత్తకూ ... పెద్దమ్మడుకూ బంగారుకూ చిన్నారికీ ..అందరికీ తెలుసు..."
నెమ్మదిగా వచ్చింది జవాబు
"అత్తా..."
"అవును మా అక్కజెల్లెళ్ళం మీ అక్కజెల్లేళ్ళు అందరూ బాధితులే..."
" మరి మరి ఎందుకు ఊరుకున్నారత్తా ..."
"ఊరుకోక ఏం చెయ్యాలి ... మీరు పుట్టినప్పుడు మీ అమ్మకి వీలుకానప్పుడు ఈ అరాచకం సాగుతూనేవుంది. ఐదుగురూ ఆడపిల్లలు చాలదు కొడుకు కావాలి ... ఏడాదికి రెండుసార్లు ఆడపిల్ల అనగానే అమ్మకు అబార్షన్ చేయిస్తాడు
అమ్మ వంట్లో ఏం మిగిలింది ప్రాణం తప్ప... అమ్మకు తెలుసివన్నీ ..పెద్దత్త గట్టిగా ఎదురు తిరిగి నప్పుడే అమ్మ దాని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది... ఏం జరిగినా లోపలగుట్టుగావుంటుంది.. కాదంటే బయట తిరుగుళ్ళకు మరిగితే మనకు
కూడూ గుడ్డా కూడా వుండావంటూ...
ఏళ్ళుగా సాగుతున్న కధ ఇది..."
" అత్తా ..ఈ రోజు చివరకు సీమను..." వెక్కెక్కి ఏడ్చేసింది అల..
" ఇలాంటి తండ్రులు కూడా వుంటారా అత్తా ..."
రాత్రి ఎలా గడిచిందో తెలియనేలేదు.
అన్యమనస్కంగానే స్కూల్ కి వెళ్ళింది అల.
క్లాస్ లో ఒక్క ముక్క చెవికి ఎక్కడం లేదు. లేచి వెళ్ళి స్టాఫ్ రూం లోకి తొంగి చూసింది
సైన్స్ టీచర్ ఒక్కరే ఉన్నారు
తడబడుతూ వెళ్ళి నిల్చుంది
" ఏంకావలి అలా..?"
'చల్లటి ఆ స్వరం వినగానే ఎక్కెక్కి ఏడ్చేసింది...
విషయం చాలా గుట్టుగా ప్రిన్స్ పాల్ కు అక్కడ్నించి ఏఓసీ కి చేరింది.
పదిసార్లు ప్రశ్నించినా అల మళ్ళిమళ్ళి అదే చెప్పేసరికి అతనికి నమ్మకం కుదిరింది.
ముందుగా అల తల్లి అన్ని కట్టుకధలంటూ కొట్టి పారెయ్యాలని చుసినా
"నువ్వు తల్లివి ఈ పిల్లలను కాపడ గలిగిదానవు నువ్వొక్కతెవే అనగానే బోరు మంటూ జెరిగినదంతా నిజమేననీ , ఇప్పుడూ అతని జీతం రాకపోతే ఇంట్లో జరిగిన అత్యాచారాలు బయట జరుగుతాయనీ వాపోయింది.
"అమ్మా.. మా జీవితాలు ఎలాగూ నాశనమయాయి కనీసం సీమ నైనా కాపాడు " అల వేడుకుంది.
************
"తరువాత ..." కౌన్సిలింగ్ ఇచ్చే సుజాత స్వరం మౄదువుగా పలికింది.
నాన్నను మెంటల్ హాస్పిటల్ కి పంపి, ఆయన జీతం ఇంటికే పంపే షరతు మీద అమ్మను ఒప్పించి నాన్నను తీసుకువెళ్ళారు..కాని మూడో రోజే నాన్న ఆసుపత్రి లోగిలిలో చెట్టుకు ఉరేసుకున్నాడు...
మా అందరిజీవితాలకూ లోటు లేకుండా ఏఓసీ గారు ఏర్పాటు చేసినా .. నాన్న చావుకు నేనే కారణమేమో నని ఏమూలో... పిరికి భావన...
మలినమైపోయానన్న వేదన ..పెళ్ళెలా చేసుకోను ..అతన్ని వంచించడమే కదా అన్న అపరాధ భావం... "
".........."
" అందరిలా జీవితంలో స్థిరపడాలని ఉన్నా......."
" అల గారూ చెప్పడం చాలా సులభం అని అంటారు గానీ ఒక్క మాట....చిన్నప్పటి నుండీ నేర్చుకున్న పతివ్రతా పాఠాలను ప్రతినిమిషం వల్లించుకుంటూ ..జీవితాన్ని ఆచట్రం లో బిగించుకుంటు వస్తున్నాం కనక అలాగనిపిస్తుంది,
మీరు చెప్పక పోయినా గ్రహించగలను మీ అమ్మగారే మిమ్మల్ను నిందించివుంటారు...మాటిమాటికీ సతాయించివుంటారు మీ వళ్ళే ఆయన ఉరివేసుకున్నాడాని ... కాని ఒక మానసిక రోగిని ఎందరి జీవితాలతోనో ఆడుకున్న రోగ పీడితుణ్ణి ఎన్నాళ్ళలాగ భరించగలరూ? మీ చెల్లాయి ... ఆపైన ఇరుగు పొరుగుల పిల్లలు .... దానికి ఎక్కడోక్కడ భరత వాక్యం పలకాలిగా?
అలాగని ఈ రోజు నేను చెప్పగానే మీరు మారి పోతారనీ నేను హామీ ఇవ్వను ...
కాని నానమ్మకం
ఆర్నెల్లకో ఏడాదికో కొంచం కొంచం గా మీలో మార్పు తధ్యం.. దౄష్టి మార్చుకుని చూపు సవరించుకోవాలి , అంతే !"
చూపు సవరించుకుందుకు సంసిద్ధమవుతూ తలూపింది అల.

చుక్కలడిగానా
వెన్నెల రెక్కలడిగానా
చల్లగాలి వేణువూదే
తీయతీయని గానమడిగానా
చుక్కలడిగానా
చూపువంకన సిరులుపొంగే
చిరువలపుతలపుల జాడలడిగానా
పెదవి మలుపున సేదదీరే
మౌన రాగపు మనసునడిగానా ?
వెలుగునీడల దోబూచులాడె
చిలిపి సరదా మేలిపరదా
తడబాటు మేఘపు
తొలకరింపుల తొణికిసలనడిగానా
నడిరేయి వడిలో
వలపుముంగిట వెలుగు తారక
కంటిధారై మింటజారే
వెలుగువాకల వైన మడిగానా?
చుక్కలారా అక్కలారా
చక్కదనమౌమొక్కలారా
వెన్నెల దిక్కులారా
వెలుగుల చినుకులారా
ఒక్కమాటను మీ రెక్కమాటున
రాచకన్నియ రాయంచ పాపతొ
పదిలముగ పదినాళ్ళు నిలిచే
పాట పల్లవి పొదగలేరా?
చుక్కలడిగానా
వెన్నెల రెక్కలడిగానా
చల్లగాలి వేణువూదే
తీయటియని గానమడిగానా
వెన్నెల రెక్కలడిగానా
చల్లగాలి వేణువూదే
తీయతీయని గానమడిగానా
చుక్కలడిగానా
చూపువంకన సిరులుపొంగే
చిరువలపుతలపుల జాడలడిగానా
పెదవి మలుపున సేదదీరే
మౌన రాగపు మనసునడిగానా ?
వెలుగునీడల దోబూచులాడె
చిలిపి సరదా మేలిపరదా
తడబాటు మేఘపు
తొలకరింపుల తొణికిసలనడిగానా
నడిరేయి వడిలో
వలపుముంగిట వెలుగు తారక
కంటిధారై మింటజారే
వెలుగువాకల వైన మడిగానా?
చుక్కలారా అక్కలారా
చక్కదనమౌమొక్కలారా
వెన్నెల దిక్కులారా
వెలుగుల చినుకులారా
ఒక్కమాటను మీ రెక్కమాటున
రాచకన్నియ రాయంచ పాపతొ
పదిలముగ పదినాళ్ళు నిలిచే
పాట పల్లవి పొదగలేరా?
చుక్కలడిగానా
వెన్నెల రెక్కలడిగానా
చల్లగాలి వేణువూదే
తీయటియని గానమడిగానా
Subscribe to:
Posts (Atom)