Saturday, June 20, 2009

నిశ్శబ్దం

నడుస్తూ నడుస్తూన్న
అరిపాదం సౌకుమర్యం లోకి
కసుక్కున ఇనపమేకు గుచ్చుకున్నట్టు
ఉలితాకిడికి గారాలు పోతూ విలపించే
రాతిగుండె బీటవారిన వంపులో మొన లా
తడుముకుంటూచిరిగిన జీవితాల్ని అతుకులేసుకుంటున్న
పాతతరం వేల్లో దిగిపోయిన సూది మొనలా
నిశ్శబ్దం ఇలా చురుక్కుమంటూ మెత్తని కత్తిలా
ఉనికిని గాయ పరుస్తున్నవేళ

కళ్ళ ముళ్ళకంచెలు
రహస్యంగా ఎన్ని కాపలాలు కాస్తున్నా
రాత్రి మాధుర్యాలు తాగితాగి
తూలిపోతున్న ఊహలు
నింగీ నేలా పరుచుకున్న పరీమళాలై
అలరింపు గానలై
పరిసరాల్ను పరవశం ముగ్గులోకి లాగుతూ
చిక్కులు పడ్డ రహదార్ల ముళ్ళు విడదీస్తూ
ప్రతిక్షణం అల్లుకు పోతున్న పద్మవ్యూహాల్ను
చూపుల ఆయుధాల్తో సవరించుకుంటూ
అవిశ్రాంతంగా అలుగులెత్తీ పొరలే
జీవనదులు
ఒక్కసారి అదౄశ్య శక్తులు
మంత్రించినట్టునిశ్శబ్దం
ఏముందిక ఎదురులేని నిశ్శబ్దం తప్ప.

1 comment:

రచన said...

see this blog also
http://modatiadugu.blogspot.com/