Friday, November 11, 2011


పలకరింపా చిరునవ్వు వెన్నెల చిలకరింపా
పూల వానా ఇది జలతారు వెలుగు సోనా ?
ముత్యంపు పూ రెక్కలన్నీ సరిగమల రవళులను చింది నట్టు
నింగి కెగసిన హరివిల్లు రంగులన్నీ విరి బాలలై కురిసినట్టు
పలకరింపా ? ఇది తొలకరింపా ?
తొలి ప్రేమల చిరు చెమరింపా ?
పెదవి తొణికీ మధువులొలికే పూల వాగున
పరిమళాలై తేలి పోతూ సోలిపోతూ
ఎదలో పొంగి ఉప్పొంగే భావఝరుల
మగతపడుతూ మైమరచిపోతూ
పలకరింపా పులకరింపా
తొలి ప్రేమల తొలకరింపా?
ఏటి మోమున అలదుకున్న మసక వెలుతురు మేలిపరదా
ఏర్చి కూర్చిన నాట్య హేల
చుక్కలన్నీ ఒక్క వరసన వెలుగు వాకిలి తోరణాలై
స్వాగతించే రాగ గీతిక
పలకరింపా?

No comments: