ఎందుకా పరుగు నీకు ఓ చల్లగాలీ
ఎవరి చెక్కిలిపైన చిరు నవ్వై వెల్లి విరియాలనీ
అలికిడే లేని నెత్తావి గుస గుసల అలనీలి తేరువై
పులకరింతల పూల తలలూపు చిన్నారి బాలికల పున్నగ రాగమై
ఎందుకా పరుగు నీకు .............
హరిత కడలిని కాలాన్చి నర్తించు అలల రెప రెప లుగా
ఆకుచాటున దాగి ఎలమావి కోయిల సరిగమల విందుగా
ఎవరికీ దొరకని పరిమళపు అలరింపు మైపూత నీవుగా
చివరి వెన్నెల జాలు వారిన తేట తేనియ తీగగా
ఎందుకా పరుగు నీకు .............
ఏ హృదయ సీమలో పల్లవై పలికిన వలపు భావన దూతవైతివో ఏమో
ఏ గగన భూమిలో చిరుసంధ్య మెరుపులో కేరు మను పాపాయి ఊపిరవ్వాలో
లోకమంతా మేసి నెమరేయు మనస్సులో ఆనంద డోలికల కదలి కవ్వాలనో
అంతరంగము చేయు కనుసైగ లీలలను కడదాక తరలించు భాగ్యమవ్వలనో

2 comments:
బాగుంది. నాకు నచ్చింది స్వాతిగారు.
థాంక్స్
Post a Comment