Sunday, June 27, 2010

విరహ గీతి

పులకింతలపున్నాగలుఏవాకిట కురిసినా
తొలకరించు తొలి పలుకులు ఏనోటన పలికినా
పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుభాళింపు
కనుసన్నల జాజిపూలు పల్లవించుకావ్యాలే

ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నొ
ఈ వంకన నింగితాకు సింగిణీల విల్లంబులు
కనుపాపల కదలికలో హొయలొలికే సోయగాలు
కనగలిగే మనసుకైతే అరచేతిన స్వప్నమౌను

నిర్నిద్రలొ ఊహకొలను తొలిచూపుల స్పర్శకేను
జలజలమను పల్లవాలపారిజాత గమకాలై
చిరు సవ్వడి అలికిడిలో ఆదమరచి ఒక్కక్షణం
తెల్లవారె కలలన్నీ తెల్లబోయె మోవిసిరులు

2 comments:

మరువం ఉష said...

పుప్పొళ్ల జాజర, జాజిపూల జాతర,
సవ్వళ్ల ఉవ్విళ్ళు, సరిగంచు మురిపాలు,
తెలవారితే కలల సందళ్ళు,
సందెవాలితే కనుల కలవరాలు,
కలిసూన్నాదాహమే, ఎదురుచూపూనా మోహమే..
విరహాన వేగేటి ఈ జీవితమూ మధురమే.

http://maruvam.blogspot.com/2009/01/blog-post_22.html

మీ కవితతో పాటుగా నా స్పందనకి మూలం.. vipralambha: The highest perfection of 'adhirudha' affection in conjugal love involve
meeting (madana) and separation (mohana). In the ecstasy of madana,
meeting, there is kissing, and in the ecstasy of mohana, separation,
there is a symptom of separation, and there is also a symptom called
transcendental insanity. The ecstasy exhibited before the lover and beloved meet, the ecstasy experienced between them after meeting, the state of mind experienced by not meeting, and the state of mind
experienced after meeting fearing separation are called vipralambha

భావన said...

పున్నాగల ప్రవాహాలు మనసులో వూహా రూపం గా తట్టగానే కలిగిన సంతోషం మనసును మత్తిగిల్లించి వ్యాఖ్య రాయటానికి ఆలస్యం చేయించింది. చాలా బాగుందండి..