Tuesday, October 25, 2011


ఇవ్వాల్టి మనిషి

నిర్లిప్తత కప్పుకు నిద్రపొతున్న వెసూవియస్ నో
చిరునవ్వు ఉపరితలం కింద
పొగలుకక్కుతున్న సప్తసముద్రాల పాదారసాన్నో
చిటపటలాడే నిప్పురవ్వలను గుప్పిట్లో బిగించి
శరవేగంతో చుట్టుకుంటున్న అగ్నికీలల్ను
లోలోనే అదిమి పట్టి
ఆకుపచ్చ వెలుగుల్ను గుమ్మరించే
అడవితల్లినో
ఆటవిక స్వభావాన్ని సింహ గర్జ్జనల రౌద్రాన్నీ
సౌమ్యతలో మూటగట్టి అటకెక్కించి
లోలోపల మాత్రం
అవిశ్రాంతంగా అల్లుతున్న సాలెగూళ్ళు.
ఇక్కడ వన్ మాన్ షోలో
నూటికి నూరు శాతం
అత్యుత్తమతకోసం సతమత మవుతూ....
ఊపిరాడని ఊబిలో ఉక్కురిబిక్కిరవుతున్నా
చుట్టూ సుందర ప్రపంచమీద
గుప్పిళ్ళ కొద్దీ బురద జల్లుతూ
ఎప్పుడో ఏదో ఒక క్షణంలో
విస్ఫోటించే సత్యానికై ఎద్దురుచూస్తూ ............

1 comment:

జ్యోతిర్మయి said...

స్వాతి గారూ జీవన ప్రవాహంలో మనిషి అంతరంగాన్ని అభివర్ణించిన తీరు కళ్ళకు కట్టినట్టుగా ఉంది.